నిజామాబాద్ (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఎలాంటి విద్యా ర్హతలు లేకుండా, వైద్య శాఖ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వ హిస్తున్న చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్ ని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. శనివారం నిజాంబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్లో జిల్లావైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. చిన్న పిల్లలకు, బుద్దిమాధ్యం, మానసికంగా అభివృద్ది చెందని పిల్లలు వివిధ రకాలమైన థెరపి ఉపయోగిస్తూ వారికి ప్రత్యే కమైన శిక్షణను హెల్త్ కేర్ సెంటర్ లో ఇస్తారు.
స్పీచ్ థెరపీ, అసుడిపెహినల్ థెరఫీ , ఫిజియోథెరఫీ, మొదలగు రుగ్మతలకు ఈ సెంటర్లో మార్పు వచ్చేలా శిక్షణ ఇస్తారు. నలుగు రు యువకులు కలిసి ఎలాంటి విద్యార్హతలు లేకుండా వైద్య శాఖ నుండి అనుమతులు తీసుకోకుండా ఈ హెల్త్ కేర్ సెంటర్ ని నిర్వహిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారులు తెలిపారు. ఈ సెంటర్ పై ఫిర్యాదు రావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు తనిఖీ లు చేసి హెల్త్ కేర్ సెంటర్ ని సీజ్ చేశారు. వైద్య శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుం డా హెల్త్ కేర్ సెంటర్లు నిర్వ హించరాదని తెలిపారు.