Monday, November 18, 2024

TS / రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తాం – మంత్రి తుమ్మల

వైరా మార్చి 13 (ప్రభ న్యూస్): ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వైరా రిజర్వాయర్ ను సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా సాగునీరు అందించేందుకు అనుసంధానం సీతారామ ప్రాజెక్టు కాలువకు 100 కోట్లు నిధులు మంజూరు చేశారు. వైరా రిజర్వాయర్ ఆనకట్ట వద్ద డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ శంకుస్థాపన చేశారు.

. ఈ సందర్భంగా జరిగిన సభలో తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన అన్నారు . వైరా రిజర్వాయర్ను బ్యాలెన్స్ రిజర్వాయర్ గా మార్చేందుకు సీతారామ ప్రాజెక్టు కెనాల్ ను అనుసంధానం చేస్తామనీ అన్నారు . అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించారని అన్నారు.

సీతారామ ప్రాజెక్టు అనుసంధానంతో వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు సాగునీరు ,త్రాగునీరు అందిస్తామని ఆయన అన్నారు. సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 లోపే సీతారామ ప్రాజెక్టు నీళ్లను వైరా రిజర్వాయర్ లోకి అనుసంధానం చేస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ నీరు అందించటం తన చిరకాల కోరిక అని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ , సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూవాళ్ల దుర్గాప్రసాద్ , బొర్ర రాజశేఖర్ , కట్ల రంగారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట నర్సిరెడ్డి, దాసరి దానియేలు, కట్ల సంతోష్, పొదిలి హరినాథ్, ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement