హైదరాబాద్: 2023-24 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ నెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అంటే ఈ నెల 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పనున్నారు. 9, 10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. వచ్చే ఆదివారం సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చించి బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.