Thursday, October 17, 2024

TS | తమ్ముడిని హతమార్చిన అన్న..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అన్న చేతిలో తమ్ముడు హతమయ్యాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ స్వామి, రవి అన్నదమ్ములు.కుమార స్వామి కి వివాహం జరిగి విడాకులు అయినాయి. రవి, కుమార స్వామి ఇద్దరు కలిసి పెయింటింగ్ వృత్తి చేసేవారు. కొద్దికాలంగా వారు ఆ వృత్తిని వదిలేసారు.

కుమార్ స్వామి ఇంటి వద్దనే ఉంటున్నారు. రవి మేకల గొర్లు కాసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మధ్యమత్తులో ఇద్దరికీ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే క్రమంలో అన్న రవి తమ్ముడి గొంతుపై కత్తి తో దాడి చేయగా తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడిక్కడే మరణించినట్లు తెలుస్తుంది.హంతకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement