హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది అని కాంగ్రెస్ చెప్తోందని, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ .. ప్రశ్నిస్తే దాడులు, నిర్బంధాలు, ఎదురిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్‌కౌంటర్లు.. కాల్చివేతలు అని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలపై ప్రజాపాలన అని చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు శంకర్‌పై కాంగ్రెస్ గుండాలు పథకం ప్రకారం దాడి చేశారు. చంపాలని పాశవికంగా దాడికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి పాశవిక దాడిని తెలంగాణ బుద్ది జీవులు, సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాలన్నారు. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా..? దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోంది: మాజీ ఎమ్మెల్యే
ఇది ప్రజా పాలన లాగా లేదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలన లాగా కనిపిస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి . సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రమేయం లేకుండా తెలంగాణ వచ్చిందనే ప్రతీకారం ఉన్నట్టు ఉందన్నారు. అనేక మందిపై కేసులు నమోదు చేస్తున్నారని,. ప్రజలు ఇలాంటి దాడులు గమనించాలని కోరారు