Saturday, November 2, 2024

TS – ఆరూరి కోసం బిజెపి – బిఆర్ఎస్ మ‌ధ్య ల‌డాయి…

వ‌డ్డేప‌ల్లి – వ‌రంగ‌ల్ – వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పొలిటికల్ స్టెప్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. బిజెపిలో చేర‌కుండా చూసేందుకు స్వ‌యంగా ఎర్ర‌బెల్లి రంగంలోకి దిగారు.. ఆరూరి ఇంటికి వ‌చ్చి ఆయ‌న‌తో మంత‌నాలు సాగించారు.. కారులో ఆయ‌న‌ను తీసుకుని హైద‌రాబాద్ కు బ‌య‌లుదేరిన బిఆర్ఎస్ నేత‌ల‌కు మార్గ మ‌ధ్యలో బిగ్ షాక్ ఇచ్చారు బిజెపి నాయ‌కులు.. అయితే ఈ ఎపిసోడ్ క‌థ విచిత్రంగా సుఖాంతం కావ‌డం కొస‌మెరుపు ..

వివ‌రాల‌లోకి వెళితే వర్ధన్నపేటమాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి లో చేరుతున్న‌ట్లు నేటి ఉద‌యం స్వ‌యంగా ఆయ‌న ప్ర‌క‌టించారు.. దీంతో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,బసవరాజ్ సారయ్య , తెలంగాణ రాష్ట్ర రైతు రుణ కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, కూడా మాజీ చైర్మన్ మరీ యాదవ రెడ్డి, సుందర్ రాజ్ యాదవులు ఆరూరు నివాసానికి చేరుకొని పార్టీని వీడొద్దంటూ విజ్జప్తి చేశారు..ఏదైన ఉంటే చ‌ర్చించుకుందామ‌ని అన్నారు…
ఇదే స‌మ‌యంలో అక్క‌డికి ఆరూరి అనుచ‌రులు పెద్ద సంఖ్య‌లో చేరుకుని నినాదాలతో హోరెత్తించారు. ఇక చ‌ర్చ‌లు అనంత‌రం రమేష్ ను వాహనంలో మాజీ మంత్రులు తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు.. దీంతో వాహనానికి కార్యకర్తలు అడ్డు పడి తిరిగి బిఆర్ఎస్ లోకి వ వెళ్లొద్దంటూ బ్రతిమలాడారు. అయితే రమేష్ కారు దిగివచ్చి కార్యకర్తలకు నచ్చజెప్పి బిఆర్ ఎస్ నేత‌ల వాహనంలో హైద‌రాబాద్ కు బ‌య‌లుదేరారు..

పంబ‌ర్తిలో అడ్డుకున్న‌బిజెపి శ్రేణులు

హ‌నుమ‌కొండ నుంచి హైద‌రాబాద్ కు వెళుతున్న బీఆర్ఎస్ నేత‌ల కార్ల‌ను జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. కారులో ఉన్న ద‌యాక‌రరావుతో స‌హా ఇత‌ర నేత‌ల‌ను వాహ‌నాల‌ను దించివేసి వారితో వాగ్వాదానికి జేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి దిగారు. అలాగే అరూరి ర‌మేష్ ను ఆయ‌న త‌న కారులో ఎక్కించుకుని హైద‌రాబాద్ కు బ‌య‌లుదేరారు .. భారీ సంఖ్య‌లో బిజెపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అక్క‌డ‌కు చేర‌డంతో బిఆర్ ఎస్ నేత‌లు ఏమీ చేయ‌లేక మిన్న‌కుండిపోయారు..

కెసిఆర్ తో భేటి..

- Advertisement -

ఆరూరి రమేష్ నందినగర్‌లో కేసీఆర్ తో భేటి అయ్యారు. అనంత‌రం ఈ మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. “నేను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నాను. ఈరోజు నన్ను ఎవరూ అడ్డుకోలేదు. నేను ఏ బీజేపీ నేతలను కలవలేదు. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’ అని ఆరూరి రమేష్ ఎదురు ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement