హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు . మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ మండల పరిధిలో నేడు ఈ అవినీతి తిమింగలం చిక్కింది. చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే శామీర్ పేట్ మండలంలో ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణను గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూ పట్టాదారు పుస్తకం కోసం అశ్రయించాడు.. ఈ పాస్ పుస్తకం విడుదల చేసేందుకు తహసీల్దార్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఇచ్చిన సమాచారం మేరకు సత్యనారాయణ డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్ సత్యనారాయణ తీసుకోమంటేనే తాను డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించాడని, ఈ మేరకు తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు ఎసిబి అధికారులు ..
Advertisement
తాజా వార్తలు
Advertisement