Monday, November 25, 2024

TS- 25 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు స్థాన చలనం

హైదరాబాద్: తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతున్నది.. ఇప్పటికే రెవెన్యూశాఖలో పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం మరోసారి 25 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలా ఉండగా.. రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న తహశీల్దార్లను. ఈ ఏడాది జూన్ 30 నాటికి పదవీ విరమణ చేయనున్న మరో 17 మంది తహసీల్దార్లను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. మల్టీజోన్-1 పరిధిలో మొత్తం 81 మంది తహశీల్దార్లు, మల్టీజోన్-2 పరిధిలో మొత్తం 48 మంది తహశీల్దార్లకు స్థానచలనం కలిగించింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement