హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రస్తుత అసెంబ్లి ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. చట్టసభల్లోకి చదువుకున్న నాయకులు రావాలని, అలాగైతేనే సమజానికి మేలు జరుగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్న వేళ… ఏకంగా 15 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలిచి తెలంగాణ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజా అసెంబ్లి ఎన్నికల ఫలితాల్లో వివిధ పార్టీలకు చెందిన 15 మంది వైద్యులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు.
వీరిలో కొంత మంది ఎంబీబీఎస్ డాక్టర్లుండగా మరికొంతమంది స్పెషలిస్టులున్నారు. గెలిచిన 15 మంది వైద్యుల్లో 10 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం మరో విశేషం. ఎమ్మెల్యేలుగా గెలిచిన 15మంది వైద్యుల్లో అయిగురికి ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు వైద్య సేవలందిస్తున్న వీరంతా ఇకపై ప్రజా సేవలోనూ నిమగ్నం కానున్నారు.
ఎమ్మెల్యే – వైద్య పట్టా – నియోజకవర్గం
డాక్టర్ వివేక్ వెంకటస్వామి – ఎంబీబీఎస్ – చెన్నూరు
డాక్టర్ వంశీకృష్ణ – జనరల్ సర్జన్ – అచ్చంపేట
డాక్టర్ భూపతిరెడ్డి – ఆర్థోపెడాలజిస్ట్ – నిజామాబాద్
డాక్టర్ రామచంద్రునాయక్ – ఎంఎస్ సర్జన్ – డోర్నకల్
డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు – ఎంఎస్ ఆర్థో – సిర్పూర్
డాక్టర్ మురళీనాయక్ – ఎంఎస్ సర్జన్ – మహబూబాబాద్.
డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ – ఎంఎస్ సర్జన్ – మానకొండూరు
డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి – ఎండీ రేడియాలజీ – నారాయణపేట.
డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి – పీడియాట్రిషన్ – నారాయణఖేడ్.
డాక్టర్ మైనంపల్లి రోహిత్ – ఎంబీబీఎస్ – మెదక్
డాక్టర్ సంజయ్‌కుమార్ – కంటి డాక్టర్ – జగిత్యాల.
డాక్టర్ సంజయ్‌కుమార్ – న్యూరోస్పైన్ సర్జన్ – కోరుట్ల.
డాక్టర్ తెల్లం వెంట్రావు ఆర్థో భద్రాచలం.
డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి – డెంటల్ – నాగర్‌కర్నూల్.
డాక్టర్ మట్టా రాగమయి – పల్మనాలజిస్ట్ – సత్తుపల్లి