Tuesday, November 26, 2024

TS – మూడు పిల్లర్లు రిపేర్ చేయించలేని అసమర్థ ప్రభుత్వమా మీది – రేవంత్ ను నిలదీసిన కేటీఆర్

మేడిగడ్డ బ్యారేజీలోని 86 పిల్లర్లలో ఒకటి కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్. అన్నారు.. మేడిగడ్డ ను బి అర్ ఎస్ బృందం నేడు పరిశీలించింది. ఆనంతరం ప్రాజెక్టు వద్ద పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు 100 అంకాలలో మేడిగడ్డ బ్యారేజీ ఒకటి అని తెలిపారు. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డలో చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయొచ్చని ఇంజనీర్లు చెబుతున్నారని వాటిని కూడా రిపేర్ చేయించలేని అసమర్థ ప్రభుత్వమా మీది అంటూ రేవంత్ సర్కార్ ను నిలదీశారు

తమపై కోపం ఉంటే తమ మీదనే చూపాలని కానీ రైతులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ద రించాలని కోరారు. అవసరమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్‌లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులపై పగపట్టొద్దని.. వరదలు వచ్చేలోగా ప్రాజెక్టును పునరుద్దరించాలని కేటీఆర్ కోరారు

రాబోయే రోజుల్లో పంటలు ఎండిపోకూడదంటే.. కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లలను సరి చేయకుండా.. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. .

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వాస్తవాలు తెలియజేసేందుకు చలో మేడిగడ్డ పర్యటనకు వచ్చామని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మేడిగడ్డ, అన్నారం బరాజ్‌ను సందర్శించామని, . కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తామని పేర్కొన్నారు .

- Advertisement -

. ఇది మొదటి అడుగు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బరాజ్ అన్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మూడు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల టన్నెల్స్, 1500 కిలోమీటర్ల కెనాల్స్ కలిపితే కాళేశ్వరం అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు రైతాంగానికి వాస్తవాలు చెప్పాల్సిన అసవరం ఉందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. 1.6 కి.మీ. మేడిగడ్డ బరాజ్‌లో 83 పిల్లర్లు ఉన్నాయి. అందులో మూడు పిల్లర్లు వద్ద సమస్య వస్తే మొత్తం కాళేశ్వరం వృథా అయిందని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతాం. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేసి నీళ్లు విడుదల చేయాలి. బీఆర్ఎస్‌పై బురద జల్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు:

Advertisement

తాజా వార్తలు

Advertisement