Friday, October 18, 2024

TS: బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ బ‌లిదానం.. రేవంత్ రెడ్డి

8 సీట్ల‌లో విజ‌యం కోసం బీజేపీకి కారు సాయం
లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో మ‌రోసారి ఏక‌మైన‌ కారు, క‌మ‌లం
ఆరు నెల‌ల త‌మ‌ పాల‌న‌ను మెచ్చిన జ‌నం
అందుకే తామే ఎనిమిది సీట్లు గెలిచాం
లోక్ స‌భ ఫలితాల త‌ర్వాత రేవంత్ రెడ్డి కామెంట్స్

హైద‌రాబాద్ : బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ‌ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నచ్చి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేశారని, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం గుండు సున్నా పెట్టారన్నారు. కనీసం రాష్ట్ర అవతరణ వేడుకలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదని విమర్శించారు. కుటుంబం స్వార్థం, పార్టీ మనుగడ, ఆస్తులు కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా అతని సరళిని మార్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రలతో కాంగ్రెస్ మిగతా 8 చోట్ల ఓడిపోయిందని వెల్లడించారు. కేసీఆర్ రాజకీయ జూదగాడని, కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు ఉంటాయన్నారు.


ఇక ఇండియా కూట‌మిదే జోరు…
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన అందరికీ అభినందనలు తెలిపారు. ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమే ప్రత్యామ్నాయమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశంలో పరిస్థితి మారిందన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. కాంగ్రెస్ పాలన నచ్చితేనే ఓటు వేయాలని ప్రజలను కోరామని సీఎం చెప్పారు.

కాంగ్రెస్ పాలనపై సంతృప్తి..
కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వందరోజుల్లో గ్యారంటీలను అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చాయ‌న్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 41శాతం ఓట్లు వచ్చాయన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో 8 సీట్లు అధికంగా ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి సమానంగా పోటీ పడిందని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement