హుజరాబాద్ ఉప ఎన్నిక లో బిజెపి పనైపోయిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జమ్మికుంట పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ బడా జుటా పార్టీని నమ్మే పరిస్థితిలో హుజురాబాద్ ప్రజలు లేరని అన్నారు. కేసీఆర్ చేపడుతున్న సంక్షేమమే కోరుకుంటున్నారన్నారు. ఈనెల 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ ను అసెంబ్లీకి పంపాలన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ ప్రతినిత్యం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడి పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి నిరుపేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నరని చెప్పారు. హుజరాబాద్ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని మంత్రి కొప్పులు కోరారు.
ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచారం లేనట్లే.. TRS గెలుపు సాధ్యమేనా?