హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. జనం దృష్టిలో తేలికైపోయిన టీఆరెస్ ప్రభుత్వం మరింత నవ్వుల పాలు కాక తప్పదని చెప్పారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా హుజురాబాద్‌లో ఈటల గెలుపు, టీఆరెస్ ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. ‘‘ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంసిద్ధతపై ప్రశ్నిస్తే తమ వల్ల కాదని కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుని మంచి గాలప్ మీద భాగ్ మిల్కా లెక్క ఉరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినకుండా మిలియన్ల సంఖ్యలో ఓటర్లు పాల్గొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించిన ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేవలం 100కు పైన ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు చెయ్యవలసిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పించుకుని వాయిదా వేసే ప్రయత్నం కేవలం హుజురాబాద్ ఎన్నిక వస్తుందన్న భయంతో మాత్రమే… ఇంకా సమయం దొరికితే మరిన్ని మోసపు పథకాలు తెచ్చి, నాయకులను కొనుగోలు చేసి, బీజేపీ కార్యకర్తలను ఒత్తిళ్ళకు గురి చేసే విధంగా కేసులు, వేధింపులు చేపట్టి, ప్రజలను భయభ్రాంతులను చేసి, ఎలాగైనా గెలవాలన్న దుర్మార్గపు ఆలోచనలో భాగంగానే ఈ పలాయనవాదాన్ని ప్రస్తుతానికి అడ్డు పెట్టుకున్నట్లుంది. ఈ పనులన్నిటి ద్వారా ఇప్పటికే జనం దృష్టిలో తేలికైపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత నవ్వుల పాలు కాక తప్పదు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా హుజురాబాద్‌లో ఈటల గారి గెలుపు, టీఆర్ఎస్ ఓటమి ఖాయం. ఇప్పటిదాంకా చేసిన, చేస్తున్న అరాచక కార్యాచరణ వల్ల టీఆర్ఎస్ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నైతిక ఓటమి పాలైంది’’ అని రాములమ్మ పేర్కొన్నారు.
హుజురాబాద్ లో ఈటల గెలుపు.. టీఆర్ఎస్ ఓటమి తథ్యం
By mahesh kumar
- Tags
- bjp leader vijayashanthi
- Eatala Rajender
- Huzurabad by election
- important news
- Important News This Week
- Important News Today
- karimnagar latest news
- Karimnagar Live News
- karimnagar local news today
- karimnagar news
- karimnagar varthalu
- Latest Important News
- Most Important News
- Telanagana News
- Telangana Live News Today
- telangana news
- Telangana News Online Live
- telangana politics
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today karimnagar News
- Today News in Telugu
- trs party
- TS News Today Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement