Saturday, November 23, 2024

వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నిరసన

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వo కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మేడ్చల్ జిల్లా ఘ‌ట్కేస‌ర్ మండ‌లం ఎదులాబాద్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దిగి వచ్చేంత వరకు నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జ‌డ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు, క్లస్టర్ బాధ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement