సీఎం కేసీఆర్ హాజరయ్యే ప్రజాదీవెన సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి ఇవ్వాల (గురువారం) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు సభ ద్వారా కేంద్రంలోని బీజేపీ నిరంకుశ విధానాలను ఎండగడుదామన్నారు. సీఎం సభ అనగానే ప్రజల్లో ఉత్సాహం తొణికిసలాడుతున్నదన్నారు. సభ ద్వారా కేంద్రాన్ని తూర్పారబడుతామని, కేంద్రం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని ప్రజలకు వివరిస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గంతో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని, ఉద్యమ సమయంలో ఫ్లోరైడ్‌పై పాటలు రాసి.. సమస్యను ప్రపంచానికి సీఎం చాటారన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం ఫ్లోరైడ్‌పై యుద్ధం ప్రకటించి.. రక్కనిసి తరిమివేశారన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి. రాజగోపాల్‌రెడ్డి అనే నిరోధకుడికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సందర్భం ఏదైనా యావత్ తెలంగాణ సీఎం వెంటే నడుస్తుందన్నారు. మునుగోడు గడ్డ తెలంగాణకు అడ్డా అన్నారు జగదీశ్‌రెడ్డి. ఇక్కడ ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనన్నారు. దోచుకున్న డబ్బులతో రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ దొంగలు తెలంగాణ సమాజాన్ని కలుషితం చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు పన్నినా తెలంగాణలో బీజేపీకి స్థానం ఉండబోదని స్పస్టం చేశారు. మునుగోడులో బీజేపీకి పరాభవం తప్పదని, ఇక్కడి ప్రజలు తమ చైతన్యాన్ని చూపెడుతారన్నారు.