హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు శుక్రవారం నాడు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో సీల్డ్ కవర్లలో మేయర్లు, చైర్మన్ లు జాబితాను టిఆర్ ఎస్ అధిష్టానం ఉంచింది. వాటిని ఆయా ఎన్నికలకు పార్టీ తరుపున పరిశీలకులుగా ఎంపిక చేసిన వారికి అందజేసింది.
ఎన్నికల పరిశీలకులు…
వరంగల్ కార్పొరేషన్ – మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్
ఖమ్మం కార్పొరేషన్ – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి
కొత్తూరు మున్సిపాలిటీకి – మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
నకిరేకల్ మున్సిపాలిటీ – టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు
సిద్దిపేట మున్సిపాలిటీ – రవీందర్ సింగ్ (మాజీ మేయర్ కరీంనగర్), వంటేరు ప్రతాప్ రెడ్డి (ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
అచ్చంపేట మున్సిపాలిటీ – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
జడ్చర్ల మున్సిపాలిటీ పరిశీలకులు – మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్)
ఎన్నికల పరిశీలకులు గురువారం సాయంత్రం ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. పార్టీ అధిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల అబ్జర్వర్లు ఎన్నిక ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కౌన్సిలర్లు ,కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పొరేషన్లకు మేయర్లను, డిప్యూటీ మేయర్లను, ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలని సూచించారు.