టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ రాజీనామాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదించారు. ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్యే కోటలో బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. దీంతో ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మూడు రోజుల క్రితం బండ ప్రకాశ్ రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని చైర్మన్ వెంకయ్య నాయుడుకి సమర్పించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ వెంకయ్య నాయుడు రాజీనామాను ఆమోదించారు.
కాగా, బండ ప్రకాశ్ 2018లో తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు. ఇంకా మూడు సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొదడంతో ఇక ఎమ్మెల్సీగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.