భారతీయ జనతా పార్టీపై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ పాలిట శిఖండిలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలతో తెలంగాణకు నష్టమే తప్ప లాభం లేదని పేర్కొన్నారు. కర్షకులు, కార్మికులతో పెట్టుకున్నవారు చరిత్రలో నిలబడలేదని గుర్తు చేశారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. బీజేపీ గుజరాత్ బేరగాళ్ల పార్టీగా మారిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే మొండి.. బీజేపీ అంటే తొండి అని పేర్కొన్నారు. రైతుల కోసం బీజేపీ ఎంపీలు ప్రధానికి వినతిపత్రం ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. సింగరేణి బ్లాక్‌ల వేలాన్ని అడ్డుకుని బీజేపీ ఎంపీలు తమ నిజాయితీని చాటుకోవాలని సూచించారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి ఉద్యోగాలకు ఎసరుపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కొందరు బడా వ్యాపారులకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే కుట్ర జరుగుతున్నదని జీవన్ రెడ్డి ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement