Friday, November 22, 2024

సీఎం కుర్చీపై ఈటెల కన్ను: బాల్క సుమన్

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేతల మధ్య మాటల, తూటాలు పేలుతున్నాయి. మాజీ మంత్రి ఈటల టిఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంటే.. గులాబీ దళం విమర్శలను తిప్పి కొడుతున్నారు. ఈటల రాజేందర్‌పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. పదవులు రాగానే ఈటల తప్పుడు మార్గాలు అనుసరించారని.. అక్రమంగా ఆస్తులు, అంతస్తులు కూడబెట్టి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీపైనే కన్నేశాడని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. కేసీఆర్ అవకాశమిస్తే పాలిటిక్స్‌లో అంచెలంచెలుగా ఎదిగి చివరికి టీఆర్‌ఎస్ సర్కారుకే వ్యతిరేకంగా మాట్లాడారని మండిపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని.. ఇతర పార్టీల నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆరోపించారు. ఎస్సీల భూములు ఈటల ఆక్రమించుకున్నాడని, అందుకే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారని సుమన్ పేర్కొన్నారు. ఉప ఎన్నికలో ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని.. అదే గెల్లు శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ లాభమని సుమన్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement