హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎకరం భూమి అమ్మితే రెండు.. ఎలక్షన్లు కొట్లాడుతానని గతంలో ప్రకటించిన ఈటల రాజేందర్.. గ్రామాల్లో ఓట్ల కోనుగోలు కోసం అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో చికెన్, మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈటల సొంత కోళ్ల ఫామ్ నుండి గ్రామ గ్రామాలకు చికెన్ పంపుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమయినట్లు తమకు సమాచారం అందిదన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేంద్ర బలగాలను ఎందుకు దింపారో అర్థం కావడం లేదనీ, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు కేంద్ర హోంశాఖ ద్వారా 2 వేల మంది కేంద్ర సాయుధ బలగాలను దింపడం చిత్రంగా వుందన్నారు. ఎలాంటి సమస్యాత్మక గ్రామాలు, గతంలో ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకున్నా పెద్ద ఎత్తున బలగాలను దింపడం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్రలు దాగి ఉన్నట్లు చెప్పారు. నలుగురు ఆడిషనల్ ఎస్పీ లు, 30 మంది డిస్పీ లను ఎందుకు దింపారో అర్థం కావడం లేదన్నారు. పూర్తి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. పచ్చిమ బెంగాల్ లో ఆదనపు బలగాలను దింపి మమత బెనర్జీని ఓడగొట్టే ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రజలు తిరస్కరించారనీ, గుజరాతి ల పాలన వద్దని తిరస్కరించిన ప్రజలు ఉప ఎన్నికల్లో బెంగాల్ పౌరుషం చూపారని, 30 న జరిగే ఎన్నికల్లో కూడా తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టాలని ప్రజలను కోరారు.
బీజేపీ పార్టీ అబద్ధాల కోరు పార్టీ అన్నారు. బీజేపీ లో మోసగాల్లు, నేరగాళ్లు చేరుతున్నారన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, ఈటల లాంటి ద్రోహులు బీజేపీలో చెరుతున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు చివరి రెండు రోజులు పెద్ద ఎత్తున డ్రామాలకు తెర దింపుతారని, ఓటమి భయం బీజేపీకి పట్టుకుందనీ, ఓటమి ఎదురవుతుందని ఈటల ఓ పెద్ద డ్రామా కు యాక్షన్ రెడీ చెసినట్లు తమకు పక్కా సమాచారం ఉన్నట్లు చెప్పారు, గోశామహల్, కరీంనగర్, దుబ్బాక ఎన్నికల్లో రాజసింగ్, రఘునందన్, బండి సంజయ్ లు పెద్ద డ్రామాలు చేసి ఓటర్ల సానుభూతిని పొంది గెలిచారని, ప్రస్తుతం ఈటల రాజేందర్ అదే అనుసరించి గెలువాలని చూస్తున్నారన్నారు. ఓడి పోతామనే భయం ఉన్న వాళ్ళు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీసీలను కించ పరిచే విదంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బానిసగా చిత్రీకరణ చేస్తూ మాట్లాడ్డం చూస్తుంటే బీజేపీ కి దళితులు, బీసీ ల పై ఎంత ఆక్రోశం ఉందో అర్ధం అవుతుందన్నారు.
హుజురాబాద్ లో బీజేపీ గెలిస్తే రాబోయే రోజుల్లో అభివృద్ధి లేక సర్వ నాశనం చేస్తారని, మరో రెండేళ్లు ప్రభుత్వం ఉండే టిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల ప్రక్రియ కు ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో నిలిచిపోయిన పెండింగ్ పనులు చేస్తున్నారని, గెల్లు గెలిస్తే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోని ఎంతో అభివృద్ధి కి కృషి జరుగుతుందనీ, అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. నిత్యం డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచుతున్నందుకు ఓట్లు వేయాలా అని పేర్కొన్నారు. బీజేపీ కాన్వాయ్ ని ఎవరు ఆపడం లేదు, కేంద్ర మంత్రులు, ఎంపీ ల వాహనాలు ఎప్పుడు పోలీసులు చెక్ చేయడం లేదన్నారు. హన్మకొండ హరిత హోటల్ కేంద్రం గా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందన్నారు. బయ్యారం, రైల్వే కోచ్, ఐటీఆర్ లాంటి సంస్థలు ఎందుకు రాలేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచారం లేనట్లే.. TRS గెలుపు సాధ్యమేనా?