ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజమైనదని… అది ఫేక్ లెటర్ అని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. అది ఫేక్ లెటర్ అని ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బండి సంజయ్ ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో ఈటల తాకట్టు పెట్టారని… ఢిల్లీ నేతల ముందు మోకరిల్లారని విమర్శించారు. ఈటల రాజేందర్ ను ఇకపై వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలని వ్యాఖ్యానించారు.
ఎన్నికల వేళ బీజేపీ వాళ్లు డబ్బు సంచులతో వస్తారని బాల్క సుమన్ అన్నారు. తనకున్న 200 ఎకరాల్లో ఒక్కో ఎకరం అమ్మి ఒక్కో ఎన్నికలో ఖర్చు పెట్టి గెలుస్తానని ఈటల చెప్పారని తెలిపారు. ఆ డబ్బు సంచులతో వచ్చే బీజేపీ నాయకులతో జాగ్రత్తగా ఉండాలని సుమన్ సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు అక్కడే ఉంటానని బాల్క సుమన్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఫ్యాక్ట్ చెక్: సీఎం కేసీఆర్‌కు ఈటల లేఖ!