కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు గంగుల తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పీయూష్ గోయల్‌తో ఈ బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కేటీఆర్‌తోపాటు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
వీరేకాకుండా ఎంపీలు, కేంద్ర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం? ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని ప్రశ్నించింది. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు సహా అందుబాటులో ఉన్న ధాన్యం రబీ పంట కొనుగోళ్ల అంశాలను కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రులు వివరిస్తున్నారు.