Tuesday, November 26, 2024

సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. బదిరుల పాఠశాలకు ఆర్థిక సహాయం

తెలంగాణ రాష్ట్ర సాధకుడు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  జిల్లా టిఆర్ఎస్ నాయకులు సూర్యాపేట మున్సిపాలిటీ 44 వార్డ్ అధ్యక్షుడు చల్లా లక్ష్మీ కాంత్ ఆర్థిక సహాయంతో కాసర బాద్ లోని బదిరుల పాఠశాలకు విద్యార్థినుల గది నిమిత్తం పది వేల నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మిదిగా పాఠశాల ప్రినిసిపాల్ మదనాచారికి అందజేశారు. కాగా, చల్లా లక్ష్మీకాంత్ ను మంత్రి అభినందిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement