నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ కు లేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం విద్యను అందించే లక్ష్యంతో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్ మెంట్ క్రింద 56 ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.
ఒక్కొక్క దానికి రూ.200 కోట్లతో నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపారు. గుమ్మడికాయల దొంగ చందంగా టీఆర్ఎస్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన నాలుగు సంవత్సరాలు ఉన్నా.. కేటీఆర్, హరీష్ ప్రజల్లో విష ప్రచారాన్ని నింపేందుకు పిచ్చి ముదిరిన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ విష ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. టీఆర్ఎస్ కు అవినీతి చీడ కేటీఆర్ భయం గుప్పెట్లో ఉన్నారని, అరెస్ట్ కావడం పక్కా అన్నారు. ఫోన్ ట్యాంపరింగ్ రూ.55వేల కోట్ల స్కాం కాలేశ్వరం, తదితర వాటిపై కేటీఆర్, హరీష్, కేసీఆర్ లకు భయం పట్టుకుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నీరు లేకుండా ఈ సంవత్సరం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి 50లక్షల ఎకరాలు సాగు చేయడం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలు బిల్లుల చెల్లింపు బోనస్ ఇస్తుంది కాంగ్రెస్ అని, అది నిజమో కాదో తెలుసుకోవాలంటే హరీష్ జనగామకు రావాలన్నారు. అవినీతిపరులు కాకపోతే టీఆర్ఎస్ కు భయమెందుకు అని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల విష ప్రచారం మానుకుంటే మంచిదని, భవిష్యత్తులో జనంలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు.