Saturday, November 23, 2024

అభివృద్దిలో టీఆర్ఎస్ విఫ‌లం..రేవంత్ రెడ్డి

అభివృద్ధిలో టీఆర్ఎస్ విఫ‌ల‌మైంద‌ని, పట్టణాల సమస్యలు పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బడంగపేట్ కార్పొరేషన్ మేయర్ చుగురింత‌ పారిజాత నరసింహా రెడ్డి దంపతులు, బడంగపేట్ 20వ డివిజన్ కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస రెడ్డి పీసీసీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈసంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. కనీస సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించలేకపోయిందన్నారు. చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వం పార్టీ తీర్చడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పనుల కోసం టిఆర్ఎస్ లీడర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇంతకాలం టిఆర్ఎస్ తో కలిసి పనిచేసినా ప్రజా సమస్యలు తీర్చడం లేదన్నారు.. అందులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీని చాలామంది వీడుతున్నారన్నారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో అనేక ప్రజా పథకాలను తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర కీలకంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విడుస్తోంది.. డీజిల్ గ్యాస్ ధరలు రెట్టింపు స్థాయిలో పెరిగాయన్నారు. దేశంలో మత సామరస్యం దెబ్బ తింద‌న్నారు.

- Advertisement -

మేయర్ పారిజాత రెడ్డి.. మాట్లాడుతూ…తాను గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ లోకి వెళ్లానన్నాఉ. స్థానిక సమస్యల కోసం అనేక ప్రయత్నాలు చేశానన్నారు. చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. స్థానిక సమస్యలను పైవారికి తెలిసే ప్రయత్నం చేసినా అది చేరట్లేదన్నారు. ప్రజా సమస్యలు తీర్చలేక పోవడంతో నిరాశతో ఉన్నామ‌న్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉంటే కష్టసాధ్యంగా ఉందని.. అందుకోసమే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement