నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులో ఉద్రిక్తత నెలకొంది. చండూరు తహసీల్దార్ ఆఫీసు ముందు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మునుగోడు ఉప ఎన్నికలో TRS పార్టీ కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, డోజర్, గుర్తులను ఇతర పార్టీలకు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించడంపై కార్యకర్తలు భగ్గుమన్నారు. కారు గుర్తును పోలిన ఇతర గుర్తులను తొలగించాలని ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో తహసీల్దార్ ఆఫీసు వద్ద గందరగోళం నెలకొంది.
చండూలో టీఆర్ఎస్ మెరుపు ధర్నా.. కారు గుర్తును పోలిన సింబల్స్ తొలగించాలని డిమాండ్
Advertisement
తాజా వార్తలు
Advertisement