పెద్దపల్లి: న్యాయవాదులైన గట్టు వామన్‌రావు దంపతుల హత్యతో టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధం లేదని భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీహర్షిని అన్నారు. గ్రామంలోని ఆలయ నిర్మాణ విషయంలో నిందితుడు కుంట శ్రీనుకు.. వామన్ రావుకు మధ్య ఉన్న విభేదాలే హత్యకు దారితీశాయని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి ఆమె మంథనిలో మీడియాతో మాట్లాడుతూ, కుంట శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్లే ఈ హత్య జరిగిందని బావిస్తున్నామన్నారు. ఈ విషయంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేయడం సరైనది కాదని హితవు పలికారు. గతంలో శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్న సమయంలో కూడా కాటారం మండలంలో ఐదు హత్యలు జరిగాయని, వాటికి శ్రీధర్బాబు బాధ్యత వహించాడా? అని ప్రశ్నించారు. వామన్‌రావు దంపతుల హత్యను తాము కూడా ఖండిస్తున్నామని చెప్పారు. పోలీసులు చట్టం ప్రకారం విచారణ కొనసాగిస్తూ నిందితులకు శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement