ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ట్రబులే అని.. కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డిని పెట్టడం వల్ల.. నైతికంగా ఉమ్మడి మెదక్ జిలాల్లో కాంగ్రెస్ పార్టీ దే విజయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి మెదక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలోని టీఎన్జీఓఎస్ భవన్ లో ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడంతో హరీష్ రావు స్థానిక నేతలను సొంత అల్లుండ్లుగా, సొంత బిడ్డలుగా చూసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాంప్ లు పెట్టలేదని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, 700 పైచిలుకు ఓట్లు ఉండి కూడా క్యాంప్ పెట్టిందన్నారు.
ఉమ్మడి మెదక్ జిలాల్లో యునానిమాస్ కావొద్దనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్మల జగ్గారెడ్డిని బరిలో పెట్టడం జరిగిందన్నారు. 230 ఓట్లతో పాటు తమకు మరో 170 ఓట్లు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఇక ఆ పై ఏమైనా ఉంటే అది దైవ నిర్ణయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడంతో టీఆర్ఎస్ పార్టీకి గుబులు పట్టుకుందన్నారు. గతంలో కూడా ఉమ్మడి మెదక్ జిలాల్లో కాంగ్రెస్, టీడీపీ ది పై చేయి ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ కి 8 స్థానాలు ఉండొచ్చు.. కానీ రేపు మరోసారి ఆ సంఖ్య కాంగ్రెస్ కి వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital