హైదరాబాద్ – జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ , సీఎం రేవంత్ రెడ్డి , నివాళులర్పించారు.. ముందుగా గాంధీ ఘాట్ పై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.. ఇక మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ,ఉన్నతాధికారులు కూడా ఈ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
శాసన సభ ఆవరణలో..
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ , శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి , లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు.