Wednesday, October 23, 2024

Tributes …. సార్… అడుగు జాడలలోనే మేం…

ప్రొఫెసర్ జయశంకర్ కు కెసిఆర్ నివాళి
మలిదశ ఉధ్యమంలో మీరే మా సారథి
మీ అడుగు జాడలలోనే మా అడుగులు
పుట్టుక మీది..చావు మీది…
బతుకంతా తెలంగాణాది అంటూ అంజలి

హైదరాబాద్‌, : ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆయన తెలంగాణ కోసం చేసిన కృషి, త్యాగాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్మరించుకున్నారు. తొలిదశ నుం చి మలి దశ ఉద్యమం దాకా తెలంగాణ సాధన దిశగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన భావజాల వ్యాప్తి, దశాబ్దాలపాటు సాగిన ఉద్యమంలో వా రు అందించిన పోరాటస్ఫూర్తిని కేసీఆర్‌ కొనియాడారు. వారి అడుగుజాడల్లో తాను మలిదశ ఉద్యమానికి సారథ్యం వహించి, చివరి దాకా శాంతియుత పద్ధతిలో, పార్లమెంటరీ పంథాలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించినట్టు చెప్పారు.

చివరకు అరవై ఏండ్ల స్వయంపాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్‌ గుర్తుచేశారు. రాష్ట్ర సాధ న అనంతరం ప్రజల మద్దతుతో మొట్టమొదటి ప్రభుత్వాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్ఫూర్తితోనే కొనసాగించామని కేసీఆర్‌ తెలిపారు. ఉద్యమాన్ని నడిపి గమ్యాన్ని చేరుకోవడంలోనూ, తదనంతరం పదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించడంలోనూ వారి స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్‌ పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను, సకలజనులను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన బీఆర్‌ఎస్‌ పాలన స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలంగాణను మరింతగా ప్రగతి పథంలో నడిపేలా కృషి చేయడమే వారికందించే ఘననివాళి అని కేసీఆర్‌ తెలిపారు.

- Advertisement -

పుట్టుక మీది..చావు మీది… బతుకంతా తెలంగాణాది… కెటిఆర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్‌ సార్‌ తన జీవితాన్ని ధారబోసారని కేటీఆర్‌ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమని, స్ఫూర్తి మరచిపోలేనిదని కొనియాడారు. పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది అని కీర్తించారు.
‘‘పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనది.. వారి స్ఫూర్తి మరిచిపోలేనిది. సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం.. తెలంగాణ ప్రగతి ప్రస్థానం. జోహార్ జయశంకర్ సార్! జై తెలంగాణ’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement