హైదరాబాద్ – హీమోఫొలియా బాధితులు సకాలంలో చికిత్స చేయించుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని ప్రముఖ హేమటాలజీ వైద్యనిపుణులు తెలిపారు. వ్యాధిగ్రస్తుల శరీరంలో అంతర్గత రక్తస్రావం జరుగకుండా ఫ్యాక్టర్ ఇంజక్షన్లు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ అబిడ్స్ లోని ప్రభాత్ టవర్స్ సమావేశమందిరంలో హీమోఫిలియా హైదరాబాద్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫ్యాక్టర్ ఇంజిక్ణన్ల పంపిణీ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ హైదరాబాద్ సమన్వయకర్త హేమటాలజీ వైద్యులు డాక్టర్ విక్రమ్ కుమార్, డాక్టర్ శ్రావ్య, ఫిజియోథెరిపి వైద్య నిపుణులు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
హీమోఫిలియా వ్యాధి తీవ్రత, వైద్య చికిత్స పై అవగాహన కల్పించారు..వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి చర్చించి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఇన్ టాక్ ఫౌండేషన్ సమకూర్చిన 12లక్షల విలువైన ఫ్యాక్టర్ 8 ఇంజిక్షన్ లను ఉచితంగా అందజేశారు..ఒక్కొక్కరికి 25వేల రూపాయల విలువ చేసె ఇంజక్షన్లను 50 మంది వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేశారు..
ఈ కార్యక్రమంలో హీమోఫిలియా హైదరాబాద్ సోసైటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, ఉపాధ్యక్షులు రజాక్, హేమంత్ కుమార్,దీపిక, సుజాత, ఇన్టాస్ ఫౌండేషన్ ప్రాజెక్టు కో అర్డినేటర్ కరుణాకర్, పెషెంట్ కౌన్సిలర్స్ సుజాత, శివ శంకర్, తదితరులు పాల్గొన్నారు.