Thursday, September 19, 2024

TG | సీఎం రేవంత్ నిర్ణయపై ట్రాన్స్‌జెండర్ల హ‌ర్షం..

ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలని.. ట్రాఫిక్‌ నియంత్రణకు వాలంటీర్లుగా తీసుకోవాలనే సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయంపై ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని రోజులు తమను చీదరించున్న సమాజం ఇకనైనా తమను ఆదరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రాఫిక్ నియంత్రణలో తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలో.. తమ కోరికల జాబితాను సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఒక్క హైదరాబాద్ లోనే 5000 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని… రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లు ఉంటారని తెలిపారు.

అర్హులైన, ఆసక్తిగల వారికి ట్రాఫిక్ వాలంటీర్లుగా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. వలంటీర్లుగా పనిచేస్తున్న వారికి 35 వేల స్టైఫండ్ ఇవ్వాలని, అదేవిధంగా జీహెచ్‌ఎంసీలోని ఇత‌ర‌ విభాగాల్లోనూ ఉద్యోగాలు క‌ల్పించాల‌ని కోరారు. ముందుగా తెలంగాణ, హైదరాబాద్‌లోని వారికి అవకాశం ఇవ్వాలని.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల ఫ్రెండ్స్ జెండర్స్‌కు కూడా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement