Saturday, November 23, 2024

వరంగల్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్ స్పెక్టర్లు, 17 మంది సబ్ ఇన్ స్పెక్టర్ల బదిలీలు

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో నలుగురు ఇన్ స్పెక్టర్లు, 17 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు బదిలీలు అయ్యారు. ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్ స్పెక్టర్లు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు ఇన్ స్పెక్టర్లు అయిన.. జె. వెంకటరత్నం వీఆర్ నుండి పరకాల కు, పి.కిషన్ పరకాల నుండి వి.ఆర్ కు, కె.రామకృష్ణ కాజీపేట్ ట్రాఫిక్ నుండి గీసుగోండ కు, ఎస్.రాజు గీసుగోండ నుండి వి.ఆర్ కు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే… సబ్ ఇన్ స్పెక్టర్లు.. డి. విజయ్ కుమార్ హాసన్ పర్తి నుండి రాయపర్తి కి, బి. రాజు రాయపర్తి నుండి మడికొండకు, డి. రాజు టాస్క్ ఫోర్స్ నుండి వి ఆర్ కు, బి.శ్రవణ్ కుమార్ స్టేషన్ ఘన్పూర్ నుండి కొడకండ్ల కు, ఎల్.కొమురెల్లి కొడకండ్ల నుండి ఇంటే జార్ గంజ్ కు, వి.నవీన్ కుమార్ దుగ్గొండి నుండి అయినవోలు కు, జి. వెంకన్న అయినవోలు నుండి ఇంతేజార్ గంజ్ కు,
ఈ.వీరభద్ర రావు శాయంపేట నుండి పర్వతగిరి కి, డి.దేవేందర్ పర్వతగిరి నుండి కమలాపూర్ కు, ఈ.నరసింహారావు మడికొండ నుండి టాస్క్ ఫోర్స్ కు, ఆర్.రణధీర్ అటాచ్డ్ కాజీపేట ట్రాఫిక్ నుండి వరంగల్ ట్రాఫిక్ కు, ఆర్.రామారావు వరంగల్ ట్రాఫిక్ నుండి కాజీపేట ట్రాఫిక్ కు, జె.నాగరాజు ఇన్తెజార్గంజ్ నుండి ఘన్పూర్ స్టేషన్ కు, వి.ఆర్ అటాచ్ టు మిల్స్ కాలనీ నుండి టాస్క్ ఫోర్స్ కు, కె.కిషోర్ విఆర్ నుండి హసన్పర్తి కి, వి.చరణ్ కుమార్ కమలాపూర్ నుండి వి ఆర్ కు, ఎండి.రవుఫ్ విఆర్ నుండి ఎస్సై 2 పాలకుర్తి కి బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి రంగనాథ్ ఇవాల ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement