బదిలీలు సర్వ సాధారణమని, అవకాశమొస్తే మళ్లీ వరంగల్ కు వస్తానని సీపీ రంగనాథ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ బదిలీపై వెళ్తున్న సీపీ రంగనాథ్ మీడియాతో భావోద్వేగంతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమన్నారు. కానీ వరంగల్ లో ప్రజలతో, మీడియాతో చాలా సింక్ అయినానన్నారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి.. వాటివల్ల తాను ప్రజలకు దగ్గర అయిన ఐడియాలజీతో పోలీస్ పని ఇలా ఉంది.. బలహీనంగా ఉన్న వాడిని బలవంతుడి నుండి కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు లాండ్ ఆర్డర్ ఉందన్నారు. అన్యాయంగా ఉంటే న్యాయం కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఉదయం 7గంటల నుండి రాత్రి 11గంటల వరకు ప్రజల సమస్యలు, అధికారులతో ఫోన్ మాట్లాడిన సందర్భం ఉందన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘తాను మాభూమి సినిమా చిన్నప్పుడు చూసాను.. కానీ ఇక్కడ నిజ జీవితంలో భూ సమస్యలు చూసానన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు సపోర్ట్ గా ఉన్నారన్నారు. విద్యార్థులు సమస్యను కేటీఆర్ దృష్టి కి తీసుకెళ్ళను.భూ సమస్యలు చాలా బాధాకరం.అలాంటి వాటిని సమస్య, ఎమోషనల్ ని చూడాలి..వరంగల్ మీడియా చాలా సపోర్ట్ గా ఉన్నారు.అన్యాయం ను ఎదురించాలి. అధికారులు కొంత తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి.
పవర్ ఉందని చేస్తే ఇబ్బందులు ఉంటాయి.. ప్రతివారికీ చెక్కు పెట్టాలి..లేదంటే మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం..అందరం ఒకటే..వరంగల్ పని చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. పలువురు నేతలు తనకు సపోర్ట్ చేశారు. ఎక్కడైనా తప్పుడు కేసులు పెడితే నేను సహించాను..మర్డర్ కేసులో తప్పు చేయని వారికి శిక పడితే పరిస్థితి ఏంటి. నాకు అవకాశం వస్తే ఇక్కడకు రావాలని అనుకుంటున్నాను. ప్రజల కోసం పనిచేయాలని అనుకుంటున్నా.. నేను ఎక్కువ ఎవరితో ఇంట్రాక్ట్ కాలేదు.. మీరు హైదరాబాద్ వస్తే కలువొచ్చు.. మీకు ఏదైనా సమస్య ఉంటే న్యాయం ఉంటే కచ్చితంగా సహాయం చేస్తాను’’ అంటూ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఇంచార్జి మురళీధర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి, సదయ్య, ట్రెజరేర్ బొల్లా అమర్, సీనియర్ జర్నలిస్ట్ 143 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, సీనియర్ జర్నలిస్ట్ దాసరి కృష్ణ రెడ్డి, టీయూ డబ్యూ రాష్ట్ర నాయకులు మధు, కార్యవర్గం మీడియా ప్రతినిధులు, హనుమకొండ ఏసీపీ కిరణ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.