Wednesday, November 20, 2024

TS | ముగ్గురు ఇన్స్ స్పెక్టర్లు, అయిదుగురు ఎస్సైల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన సీపీ రంగనాథ్

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముగ్గురు ఇన్‌స్సెక్ట‌ర్లు, అయిదుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల సమయంలో అత్యంత ముఖ్యమైన స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల వేళ అభ్యర్థులకు సంబంధించిన ప్రచార పర్వాలు, ఘర్షణలు, అల్లర్లు, త‌దిత‌ర విషయాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వేకన్సీ రిజర్వులో ఉన్న ఇన్‌స్పెక్ట‌ర్లను స్పెషల్ బ్రాంచ్ లో పోస్టింగ్స్ ఇస్తూ పోలీస్ కమిషనర్ చర్యలు చేపట్టారు. వరంగల్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. సూర్య ప్రసాద్ ను వరంగల్ అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే అర్బన్ మహిళ పోలీస్ స్టేషన్ నుండి వేకన్సీ రిజర్వులో ఉన్న ఎండి ఉస్మాన్ షరీప్ ను స్పెషల్ బ్రాంచ్ కు,అలాగే ధర్మసాగర్ నుండి వేకన్సీ రిజర్వులో ఉన్న మరో ఇన్స్ పెక్టర్ ఒంటె రమేష్ ను కూడ స్పెషల్ బ్రాంచ్ కు బదిలి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయిదుగురు ఎస్సైల బదిలీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అయిదుగురు సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. మామూనూరు ఎస్సై ఎన్. క్రిష్ణ వేణిని కాజీపేటకు, పరకాల ఎస్సై యం. రమేష్ ను కాజీపేటకు బదిలీ చేశారు. ఇంతేజార్ గంజ్ ఎస్సై జి. వెంకన్నను మిల్స్ కాలనీకి, స్టేషన్ ఘన్ పూర్ ఎస్సై బి. హరికృష్ణ ను మిల్స్ కాలనీకీ, కాజీపేట ఎస్సైయం. డి. తాజ్ మహమ్మద్ ను వేకన్సీ రిజర్వుకు బదిలి చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement