తెలంగాణలో భారీగా ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగింది. ఇవ్వాల రాత్రి దీనికి సంబంధించిన జీవోని ప్రభుత్వం విడుదల చేసింది. ఒకేసారి 29 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఇందులో సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్‌గా కొత్త పోస్టును క్రియేట్ చేశారు. ఇక.. అడిషనల్ డీజీగా ఉన్న రాజీవ్ రతన్ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, సిటీ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ నార్కొటిక్ బ్యూరో అడిషనల్ డీజీగా, రోడ్డు, రైల్వే శాఖ డీజీగా ఉన్న సందీప్ శాండల్య టీఎస్పీఏ డీజీగా, గ్రేహౌండ్స్ అడషనల్ డీజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి.. ఆర్గనైజేషన్ లీగల్ డీజీగా..
పర్సనల్ డీజీగా ఉన్న బి. శివధర్‌రెడ్డి రైల్వేస్, రోడ్డు సేఫ్టీ డీజీగా, బెటాలియన్ అడిషనల్ డీజీగా ఉన్న అభిలాష్ బిస్త్ హోంగార్డ్స్ ఏడీజీగా, ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న షికా గోయల్ అడషనల్ డీజీ షీ టీమ్స్.. ఎస్ఎల్పీఆర్బీ చైర్మన్‌గా ఉన్న వి. శ్రీనివాసరావు.. పోలీసు కంప్యూటర్స్ అడషనల్ డీజీగా, షీటీమ్స్ అడషనల్ ఏడీజీగా ఉన్న స్వాతి లక్రా టీఎస్ ఎస్పీ బెటాలియన్స్ ఏ డీజీగా, వెయిటింగ్లో ఉన్న విజయ్‌కుమార్ గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ ఏడీజీగా.. నార్త్ జోన్ అడషనల్ డీజీగా ఉన్న వై నాగిరెడ్డి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా, వెయిటింగ్లో ఉన్న విక్రమ్‌సింగ్ మాన్ ఎల్ అండ్ ఓ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.