హైదరాబాద్ – తెలంగాణలో 21 మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ ఎస్పీగా కేసీఎస్ రఘువీర్, అవినీతి నిరోధకశాఖ జాయింట్ డైరెక్టర్‌గా బీ శ్రీనివాస్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా కే ప్రసన్న, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా శిల్పవల్లి, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీగా మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ, టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎన్ వెంకటేశ్వర్లు, ఇంటెలిజెన్స్ ఎస్పీగా రవీందర్‌రెడ్డి, టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా దేవేంద్ర సింగ్ నియామకయ్యారు.
టీఎన్ నాబ్ సైబరాబాద్ నార్కోటిక్స్ సెల్ ఎస్పీగా భాస్కర్, రాచకొండ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా గుండేటి చంద్రమోహన్, రాచకొండ ఎస్బీ డీసీపీగా పుల్ల కరుణాకర్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా మనోహర్ కసివ, సైబరాబాద్ క్రైమ్ డీసీపీగా కొత్తపల్లి నర్సింహ, డీజీపీ కార్యాలయ ఎల్ఓగా రమణకుమార్, సైబరాబాద్ వుమెన్ సేఫ్టీ డీసీపీగా కర్నం సృజన, సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్, మేడ్చల్ ఎస్ఓటీ డీసీపీగా డీ శ్రీనివాస్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా రాఘవేందర్ జాజాల, మహేశ్వరం జోన్ డీసీపీగా డీ సునీతారెడ్డి, సీఐడీ ఎస్పీగా పీ జగదీశ్వర్‌రెడ్డి, ఈస్ట్‌జోన్ డీసీపీగా బీ సాయిశ్రీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి