Friday, November 22, 2024

TS: ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రాష్ట్ర విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ఉదయం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేయడం గమనార్హం.

గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం (ఇప్పటి బీఆర్ఎస్) హయాంలో ప్రభాకర్ రావు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సీఎండీ వంటి కీలక పోస్టులో ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు. అయితే, టీఆర్ఎస్ సర్కారు మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీగా నియమించింది. అప్పటి నుంచి ఆయన పదవీ కాలం ముగిసిన ప్రతిసారీ ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement