Saturday, November 23, 2024

సర్కారు స్కూల్ టీచర్లకు ఇంగ్లిష్ లో బోధించేలా ట్రైనింగ్..

ప్ర‌భ‌న్యూస్: సర్కారు బడుల్లో ఇంగ్లీష్‌ మీడియంలో చదివే విద్యార్థులకు టీచర్లు ఇంగ్లీష్‌లో మెరుగ్గా బోధించేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు డిసెంబర్‌ 6 నుంచి ఉపాధ్యాయులకు ఆంగ్లంపై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. వారం రోజుల పాటు ఆంగ్లంపై ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిసింది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌ మీడియానికి అప్‌గ్రేడ్‌ అయిన ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యులకు ముందస్తుగా శిక్షణను ఇవ్వనున్నట్లుగా తెలిసింది. అధ్యాపకులు ఇంగ్లీష్‌పై పట్టు సాధించేలా ఈ తరగతును నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.

ఈ విద్యా సంవత్సరంలో వివిధ తరగతులకు అప్‌గ్రేడేషన్‌ కోసం 199 ప్రభుత్వ పాఠశాలలు దరఖాస్తు చేసుకోగా అందులో ఈనెల 22 వరకు 160 పాఠశాలలకు ఆంగ్లమాధ్యమానికి అధికా రులు అనుమతులు జారీ చేసినట్లుగా ఓ అధికారి తెలిపారు. ఇంకా 39 స్కూళ్లకు ఒకటి రెండ్రోజుల్లో ఆంగ్ల మాధ్యమానికి అనుమతు లను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో పనిచేసే 1000 మంది అధ్యాప కులకు ఆంగ్లంపై మొదట శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మిగతా పాఠశాలలకు చెందిన టీచర్లకు తర్ఫీదు ఇవ్వనున్నారని తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement