అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గ్రామం శ్రీ ఉమామహేశ్వర కాలనీలో ఐసిఐసిఐ పౌండేషన్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై గురువారం ఆరవ రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు పెరటి తోటల ప్రాధాన్యత గూర్చి ట్రైనర్ నరసింహ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని రమావత్ దేవి అనే మహిళా రైతు ఇంటి ఆవరణంలో పెరటి తోటను అభివృద్ధి చేశారు.
ఇలాంటి పెరటి తోటలు ప్రతి ఇంటిలో పెంచుకుని పౌష్టికాహారంగా ఆడుకుంటూ ఎక్కువ పండిన కూరగాయలను ఇతరులకు అమ్మి అధిక ఆదాయం సంపాదించుకునే అవకాశం ఐసిఐసిఐ పౌండేషన్ కల్పిస్తుందని అన్నారు .పెరటి తోటకు కావలసిన కూరగాయ విత్తనాలను ఉచితంగా ఐసిఐసిఐ పౌండేషన్ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిఐసిఐ పౌండేషన్ కమ్యూనిటీ ఫెసిలిటేటర్ జి అంతయ్య ,రైతులు నయీమ్, నారాయణ ,పర్వతాలు, హన్య, లల్యా ,తిరుపతి ,నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.