చనిపోయిందని భావించిన పులి జాడ దొరికింది. దరిగాం అటవీప్రాంతంలో ఎస్6 పులి పశువును వేటాడుతూ కెమెరాకు చిక్కింది. దీంతో పులిజాడ దొరకడం అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పశువుపై విష ప్రయోగంతో రెండు పులులు మృత్యు వాత పడిన విషయం ఆందోళన కలిగింది. ఈ నేపథ్యలో ఆ రెండింటితో పాటు ఉన్నఎస్6 కూడా చనిపోయి ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ ఆ పులి బతికే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. రెండు జిల్లాల అధికారులూ, సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా ఆరు రోజులుగా పులి కోసం గాలిస్తున్నారు. పులుల జాడ కోసం అధికారులు అడవి అంతా జల్లెడ పడుతున్నారు. ఎట్టకేలకు చిక్కిన ఎస్6 పులి పాదముద్రలు లభించడంతో పాటు దరిగాం అటవీ ప్రాంతంలోనే పశువుపై దాడి చేస్తుండగా కెమెరాకు చిక్కడటంతో తిరిగి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తమ విధుల్లోకి వెళ్ళిపోయారు.