మెట్టుగూడ సెప్టెంబర్ 28 (ప్రభ న్యూస్) ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ మెట్టుగూడ నాలా లో కొట్టుకపోయిన గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన మెట్టుగూడ ప్రాంతంలో జరిగింది. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చిలకలగూడ దూద్ బావి డబల్ బెడ్ రూమ్ సముదాయానికి ఆనుకొని ఉన్న నాలా సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తుంది. వర్షం కురుస్తున్న క్రమంలో దూద్ బావి మినీ అండర్పాస్ వద్ద గుర్తు తెలియని మహిళ మోకాళ్ళ లోతు నీరు దాటే క్రమంలో అదుపుతప్పి నీటి ప్రవాహానికి పెద్ద నాలాలోకి సాయంత్రం 6 గంటలకు పడిపోయింది. మహిళ పడిపోయిన సమాచారం అందుకున్న మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత స్థానికులు ఘటన వద్దకు చేరుకొని ఎంత వెతికినా మహిళ ఆచూకీ దొరకలేదు.
మెట్టుగూడ దూద్ బావి నాలాలో పడిపోయిన మహిళ భవాని నగర్,అన్నా నగర్, శ్రీనివాస్ నగర్,నాలుగు కిలోమీటర్లు ఉన్న ప్రాంతాలను దాటుకుని 6.35 నిమిషాలకి అంబర్ నగర్ మెడికల్ హాల్ నాలా వద్ద మృతదేహమై తేలింది.మరణించిన మహిళ ఆచూకీ తెలియాల్సి ఉంది మహిళ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించడం జరిగిందని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత తెలిపారు.