సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. వీకెండ్ కావడంతో పర్యటనకు వచ్చి కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో పడి ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వాళ్లందరూ డ్యామ్‌లో పడి గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే ఐదుగురు యువకులు మరణించారు. మిగిలిన ఇద్దరిని సురక్షితంగా కాపాడగలిగారు. మృతులను ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జనిత్‌గా గుర్తించారు.
- Advertisement -