గోదావరిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరసాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దుగ్నేపెల్లి గ్రామానికి చెందిన దాసరి కృష్ణ, మధులతల కుమారుడు దాసరి సాయి(16) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కరీంనగర్లో చదువుతున్నాడు.
అతనితో పాటు మరో విద్యార్థి గ్రామానికి చెందిన కొండ పోచయ్య, శోభల కుమారుడు కొండ అరుణ్(19) కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దీపావళి పండుగను పురస్కరించుకొని తోటి మిత్రులతో కలిసి గ్రామంలోని గోదావరిలో స్నానానికి వెళ్లారు. నీటిలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను గుర్తించారు.
- Advertisement -