ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – దేశరాజధాని ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో గల సివిల్స్ కోచింగ్ సెంటర్ భవంతిని వరద ముంచెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాతీశారు.ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో మాట్లాడిన సీఎం ఘటన వివరాలు అడిగి, తెలంగాణ వాసులు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.
ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవరూ లేరని తెలిపిన రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.. మృతుల్లో ఒకరైన తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని అని, ఆమె తండ్రి విజయ్ కుమార్ గారు సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్‌గా మంచిర్యాలలో పని చేస్తున్నారని ముఖ్యమంత్రికి తెలియజేశారు.
బాధలో ఉన్న విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.తానియా సోని మృతదేహాన్ని బీహార్ తరలించడానికి వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకుంటున్నారని, అవసరమైన సహయం అందిస్తామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ముఖ్యమంత్రి కి తెలియజేశారు.