Friday, November 22, 2024

ADB | జిల్లేడు కుంటకు నిలిచిన రాకపోకలు.. భారీ వ‌ర్షాల‌కు కొట్టుకుపోయిన రోడ్డు

ఖానాపూర్ రూరల్, (ప్రభ న్యూస్): నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన వరదల‌తో ఖానాపూర్ మండలంలోని ఓ రోడ్డు మొత్తానికే కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామానికి రాక‌పోక‌లు బంద్ అయ్యాయి. అడవి సారంగాపూర్ పంచాయతీ పరిధిలోగల జిల్లేడు కుంట గ్రామానికి వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది.

దీంతో గ్రామానికి ఆదివాసులు వెళ్లకుండా రాకపోకలు నిలిచిపోయాయి. ఏటా ఈ రోడ్డు కొట్టుకపోవడంతో కల్వర్టు నిర్మించాలని గిరిజనులు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా పైపులు వేసి, మట్టి రోడ్డు వేస్తున్నారు. కొద్ది నెలల క్రితం రూ. 3 లక్షలతో వేసిన ఈ రోడ్డు ఇప్పుడు వ‌ర్షాల‌కు కొట్టుకుపోయింది. శాశ్వ‌తంగా ప‌నులు చేప‌ట్టాల‌ని, కల్వర్టు నిర్మించాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement