Wednesday, October 9, 2024

HYD: నేడు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు…

నేడు ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ​ఆంక్షలు అమలు కానున్నట్లు సిటీ ట్రాఫిక్ ​చీఫ్ ​విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎల్‌బీ స్టేడియం పరిధిలోని ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్‌ నుంచి బీజేఆర్ విగ్రహం వైపుగా వుంటాయని అధికారులు తెలిపారు. అటుగా వచ్చే వాహనాలను నాంపల్లి స్టేషన్ రోడ్‌ లోకి మళ్లించనున్నట్లు తెలిపారు.

బషీర్‌బాగ్‌ నుంచి ఏఆర్ పెట్రోల్‌ బంక్‌ వైపు వెళ్లే వాహనాలను గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్‌ మీదుగా మళ్లించనున్నారు. ఇక, సుజాత స్కూల్‌ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్‌ బిల్డింగ్‌ వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి స్టేషన్ రోడ్‌ వైపు డైవర్ట్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు నేటి మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 8గంటల వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement