Saturday, November 23, 2024

ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్..  బ్లాక్ స్టిక్కర్లపై కొరడా

కార్ల అద్దాలకు బ్లాక్‌ స్టిక్కర్ల అమర్చిన వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఆదివారం జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బ్లాక్‌ స్టిక్కర్స్‌ వేసుకొని వస్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేశారు. అలాగే, ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై కూడా చర్యలకు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బ్లాక్‌ స్టిక్కర్లను పోలీసులు తొలగిస్తున్నారు.  నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ వాడకంపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎవి రంగనాథ్ మాట్లాడుతూ, టింటెడ్ ఫిల్మ్‌ల వాడకంపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ‘Z’, ‘Z plus’ సెక్యూరిటీ కేటగిరీల పరిధిలోకి వచ్చే వ్యక్తులకు మినహా ఎవరికీ మినహాయింపు లేదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వివిధ సెక్షన్ల ప్రకారం జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ నంబర్లను యజమానులు తారుమారు చేస్తున్న వాహనాలను కూడా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. పోలీస్, ప్రెస్, ఎమ్మెల్యే, కార్పొరేటర్ మరియు ప్రభుత్వ వాహనాల స్టిక్కర్లు కూడా మోటారు వాహన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాయని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement