చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని ఆపి చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు హోండా యాక్టివా ఏపీ 09 ఏయూ 1727 వాహనాన్ని ఆపి చెక్ చేయగా దిమ్మతి రిగిపోయే విషయం బయటపడింది. హోండా యాక్టివాపై ఏకంగా 117 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం చలాన్ల విలువ రూ.20 వేలుగా ఉన్నది. చలాన్లు కట్టకుండా తిరుగుతున్న హోండా యాక్టివా యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.
మరోవైపు వాహనదారులు తప్పనిసరిగా రూల్స్ పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలపై చలాన్లు ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని కోరుతున్నారు. చలాన్లు కట్టకుంటే మోటార్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily