పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు నంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు. బ్లాక్ స్టిక్కర్ వేసుకున్న వాహనదారులను హెచ్చరించి స్టిక్కర్లను తొలగించారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను రియలైజేషన్ ద్వారా క్లియర్ చెయించారు. ఈసందర్భంగా ఎస్‌ఐ రాజేశ్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, లేకపోతే జరిమానాలతోపాటు కేసులు నమోదవుతాయన్నారు. ధృవీకరణపత్రాలు కలిగి ఉండాలని, తప్పనిసరిగా వాహనానికి బీమా చేయించుకోవాలన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో ఎస్‌ఐలు రాజవర్దన్, మౌనికతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement